కొడుకు ప్రేయసి పైకి `రౌడీ`ని ప్రయోగించిన తండ్రి.. ఇద్దరినీ విడదీసేందుకు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-23T18:53:08+05:30 IST

వారిద్దరూ స్నేహితులు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. బెంగళూరులో ఉద్యోగాల కోసం వెళ్లి ఒకే ఇంట్లో కలిసి జీవించడం ప్రారంభించారు.

కొడుకు ప్రేయసి పైకి `రౌడీ`ని ప్రయోగించిన తండ్రి.. ఇద్దరినీ విడదీసేందుకు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే.. చివరకు..

వారిద్దరూ స్నేహితులు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. బెంగళూరులో ఉద్యోగాల కోసం వెళ్లి ఒకే ఇంట్లో కలిసి జీవించడం ప్రారంభించారు.. ఆ విషయం యువకుడి తండ్రికి తెలిసింది.. కొడుకుని హెచ్చరించినా ఫలితం లేకపోయింది.. దీంతో వారిని విడదీసేందుకు ఆ తండ్రి దారుణమైన ప్లాన్ వేశాడు.. ఆ యువతి ప్రైవేట్ ఫొటోలు సంపాదించి ఓ రౌడీకి అందజేశాడు.. ఆ ఫొటోలతో రౌడీ బెదిరింపులకు దిగాడు.. చివరకు పోలీసులకు చిక్కాడు. 


బెంగళూరులో ఉద్యోగాలు చేసేందుకు వెళ్లిన యువతీయువకులు ఒకే ఇంట్లో సహజీవనం ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న ఆ యువకుడి తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రేమను అంగీకరించేది లేదని, విడిపోవాలని సూచించాడు. అయితే ఆ అబ్బాయి తండ్రి మాట వినలేదు. దీంతో ఆ తండ్రి.. కొడుకు మొబైల్ నుంచి అతని ప్రేయసికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు సేకరించాడు. వాటిని ఓ రౌడీకి ఇచ్చి పథకం వివరించాడు. 


ఆ రౌడీ ఆ ఫొటోలతో బెదిరింపులకు దిగాడు. ఆ యువకుడిని వెంటనే వదలెయ్యకపోతే ఆ ఫొటోలను నెట్‌లో పెడతానని బెదిరించాడు. అంతేకాదు ఆ ఫొటోలను యువతి తండ్రికి కూడా పంపించాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ రౌడీని అరెస్ట్ చేశారు. యువకుడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Updated Date - 2022-02-23T18:53:08+05:30 IST