Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘పప్పా క్షమించు’ అని వేడుకున్నా కుమారుడిని చితకబాది.. కుమార్తెతో వీడియో తీయించిన తండ్రి.. చివరికి...!

హైదరాబాద్ సిటీ/చాంద్రాయణగుట్ట : అల్లరి చేస్తున్నాడని 8 ఏళ్ల కుమారుడిని చితకబాదిన తండ్రి ఉదంతమిది. ‘పప్పా క్షమించు’ అని వేడుకుంటున్నా వినకుండా కుమార్తెతో వీడియో తీయిస్తూ కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కర్ణాటక బీదర్‌ రాష్ట్రానికి చెందిన అశోక్‌ గట్టే(38), జీజాబాయిలకు ఇద్దరు సంతానం. ఏడేళ్ల సంవత్సరాల క్రితం బీదర్‌ నుంచి నగరానికి పాతబస్తీ లాల్‌దర్వాజ నాగం కాంప్లెక్స్‌లో అద్దెకుంటున్నారు. శనివారం భార్య జిజాబాయి పనికి వెళ్లింది. ఇంట్లో కూతురు, కుమారుడు, తండ్రి అశోక్‌ గట్టే ఉన్నారు. కుమారుడు అల్లరి చేస్తున్నాడని, అశోక్‌ గట్టే కర్రతో చితకబాదాడు. దానిని కుమార్తెతో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. ఆ వీడియోను బందువులకు పంపించుకున్నాడు. దీంతో ఆ వీడియో వైరల్‌ అయ్యింది. జీజాబాయి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశోక్‌ గట్టే మద్యం మత్తులో ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

TAGS: FATHER
Advertisement
Advertisement