కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి.. ఊరవతల తోటలో ఆమె కోసం వెళ్లి చూడగా.. ఆమె ఏం చేస్తోందంటే..

ABN , First Publish Date - 2022-04-13T09:02:10+05:30 IST

ఊరి కాలువ మీదుగా వెళుతున్న గ్రామస్థులకు ఒక బాలిక మృతదేహం కనిపించింది. అది చూసి అందరూ భయపడిపోయి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. మైనర్ బాలికను ఎవరో హత్య చేసి కాలువలో పడేశారని గుర్తుతెలియని వ్యక్తులపై కేసు..

కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి.. ఊరవతల తోటలో ఆమె కోసం వెళ్లి చూడగా.. ఆమె ఏం చేస్తోందంటే..

ఊరి కాలువ మీదుగా వెళుతున్న గ్రామస్థులకు ఒక బాలిక మృతదేహం కనిపించింది. అది చూసి అందరూ భయపడిపోయి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. మైనర్ బాలికను ఎవరో హత్య చేసి కాలువలో పడేశారని గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు సందర్భంగా మైనర్ బాలికను గుర్తించడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. తీరా గుర్తించిన తర్వాత.. వాళ్లకు జరిగిన దారుణం గురించి తెలిసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహరాజాగంజ్ జిల్లాలో వెలుగు చూసింది. 


మహరాజాగంజ్ జిల్లా కోల్హుయీ ప్రాంతంలో ఒక మైనర్ బాలికను రాకేష్ యాదవ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. ఈ విషయం బాలిక తండ్రికి తెలిసి తిట్టిపోశాడు. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల ఒకరోజు బాలిక సాయంత్రం అయినా ఇంటికా రాకపోవడంతో ఆ తండ్రికి భయమేసింది. కుమార్తెకు ఏమైనా జరిగిందేమో అని ఊరంతా గాలించాడు. చివరకు ఊరి బయట ఉన్న తోటలో ఆమె కనిపించింది. సదరు రాకేష్ యాదవ్‌తో శృంగారంలో మునిగి ఉన్న కుమార్తెను చూసి ఆ తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమార్తె పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న కాలువలో పడేశాడు. చుట్టూ ఉన్న చీకటిని ఆసరాగా చేసుకొని రాకేష్ యాదవ్ పారిపోయాడు. 


పోలీసుల విచారణ సందర్భంగా మృతురాలి తండ్రి, సోదరుడిని విచారణ చేశారు. ఇద్దరినీ వేరువేరుగా ప్రశ్నించగా.. పొంతన లేని విధంగా వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక సోదరుడు తండ్రే కూతురిని పరువు కోసం హత్య చేసినట్టు చెప్పాడు. దీంతో బాలిక తండ్రిపై హత్యానేరం కింద, ఆమెను ప్రేమించిన రాకేష్ యాదవ్‌పై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.


Updated Date - 2022-04-13T09:02:10+05:30 IST