అర్ధరాత్రి చప్పుడు రావడంతో పక్కగదిలో వెళ్లిన భర్త.. అక్కడ భార్య మరొకరితో ఉండడం చూసి.. ఆ మరొక వ్యక్తి ఎవరో చూసి మరో షాక్!

ABN , First Publish Date - 2022-04-04T08:14:48+05:30 IST

కొన్ని రోజుల క్రితం ఒక బట్టల వ్యాపారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంతక్రియలు చేస్తుండగా.. ఒక్కసారిగా ఫోన్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్టులో అతను హత్య చేయబడ్డాడని తేలింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులను విచారణ చేయగా...

అర్ధరాత్రి చప్పుడు రావడంతో పక్కగదిలో వెళ్లిన భర్త.. అక్కడ భార్య మరొకరితో ఉండడం చూసి.. ఆ మరొక వ్యక్తి ఎవరో చూసి మరో షాక్!

కొన్ని రోజుల క్రితం ఒక బట్టల వ్యాపారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని అంతక్రియలు చేస్తుండగా.. ఒక్కసారిగా ఫోన్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్టులో అతను హత్య చేయబడ్డాడని తేలింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులను విచారణ చేయగా.. అసలు విషయం తెలిసింది. వారు ఊహకు అందని ఆ నిజం విని అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ హత్య చేసింది స్వయానా మ‌ృతుడి తండ్రి.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వర్ నగరంలో నివసించే విక్రమ్ సింగ్ అనే యువకుడు బట్టల వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతనికి అయిదేళ్ల క్రితం పూజా కుమారితో వివాహం జరిగింది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరోజు రాత్రి భోజనం తరువాత విక్రమ్ సింగ్ తన పిల్లలతో కలిసి ఒక గదిలో నిద్రపోయాడు. అర్ధరాత్రి ఏదో చప్పుడు కావడంతో విక్రమ్ సింగ్ నిద్ర నుంచి మేల్కొని చూడగా.. అతని భార్య కనబడలేదు. పక్క గదిలో నుంచి చప్పుడు రావడంతో అక్కడికి వెళ్లి చూడగా.. విక్రమ్ సింగ్ చూసిన దృశ్యం అతడిని కలిచి వేసింది. ఆ గదిలో అతని భార్య పూజా మరో పురుషుడితో శ‌‌ృంగారం చేస్తోంది. ఆ మరో పురుషుడు మరెవరో కాదు.. విక్రమ్ సింగ్ తండ్రి బల్వంత్ సింగ్. 


ఇదంతా చూశాక విక్రమ్ సింగ్ పట్టరాని దు:ఖంతో ఆ గదిలో నుంచి బయటికి వచ్చేశాడు. అప్పుడే వెనుకనుంచి అతని భార్య, తండ్రి వచ్చి విక్రమ్ సింగ్ గొంతుకు ఒక చున్నీతో ఉరి వేసి చంపేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లు విక్రమ్ సింగ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు విక్రమ్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. కానీ పోస్టుమార్టం చేసి శవాన్ని తిరిగిచ్చేశారు. 


పోస్టుమార్టం తరువాత విక్రమ్ సింగ్ మృతదేహాన్ని అతని తండ్రి, భార్య అంతక్రియల కోసం తీసుకెళ్లారు. అప్పుడే వారికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అంతక్రియలు ఆపేయాలని పోలీసులు వారికి చెప్పారు. ఆ తరువాత పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. మృతుడి కుటుంబ సభ్యలను ప్రశ్నించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం విక్రమ్ సింగ్ గొంతు, మెడ భాగంలో చున్నీ దారాలు లభించాయని.. అందువల్ల అది హత్య అని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు విక్రమ్ భార్యపై అనుమానంతో ఆమె కఠినంగా ప్రశ్నించారు. అప్పడు పూజా అసలు విషయం బయటపెట్టింది. తన వివాహేతర సంబంధం గురించి విక్రమ్ సింగ్ ఎక్కడ బయట చెబుతాడోననే భయంతో అతని తండ్రి బల్వంత్ సింగ్ ఈ హత్య చేశాడని చెప్పింది. 


పోలీసులు ప్రస్తుతం విక్రమ్ సింగ్ హత్య కేసులో అతడి తండ్రి బల్వంత్ సింగ్, భార్య పూజా కుమారిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-04-04T08:14:48+05:30 IST