పోలీసులకు 48 గంటల సమయమిస్తూ తండ్రీకూతుళ్ల Selfie Video..

ABN , First Publish Date - 2022-06-25T19:30:12+05:30 IST

తాండూరులో తండ్రీకూతుర్లు సెల్ఫీ వీడియో(Selfie video) కలకలం రేపుతోంది. పోలీసులకు తండ్రీకూతుళ్లు 48 గంటల సమయం ఇస్తూ అల్టిమేటం జారీ చేశారు.

పోలీసులకు 48 గంటల సమయమిస్తూ తండ్రీకూతుళ్ల Selfie Video..

Vikarabad : తాండూరులో తండ్రీకూతుర్లు సెల్ఫీ వీడియో(Selfie video) కలకలం రేపుతోంది. పోలీసులకు తండ్రీకూతుళ్లు 48 గంటల సమయం ఇస్తూ అల్టిమేటం జారీ చేశారు. మూడు నెలల క్రితం అజ్ఞాతంలోకి వెళ్ళిన తన భార్యను గుర్తించాలంటూ భర్త సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన భార్య అదృశ్యం వెనుక పెద్దల హస్తం ఉందంటూ భర్త ఆరోపించాడు. ఈ క్రమంలోనే అతను కూడా తన కూతుళ్లతో సహా సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన భార్యను 48 గంటల్లోగా కనిపెట్టాలని లేదంటే.. 48 గంటల తర్వాత తమ సూసైడ్ లొకేషన్ షేర్ చేస్తా అంటూ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. తండ్రీకూతుర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-06-25T19:30:12+05:30 IST