80 వేల టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌

ABN , First Publish Date - 2021-09-29T05:57:42+05:30 IST

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గిన్నిస్‌ రికార్డును సాధించింది. దంత

80 వేల టూత్‌ బ్రష్‌లతో ఫాస్ట్‌మినార్‌

  •  గిన్నిస్‌ రికార్డ్‌ సాధించిన డాక్టర్‌ రెడ్డీస్‌


హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గిన్నిస్‌ రికార్డును సాధించింది. దంత సంరక్షణపై ప్రజలను చైతన్యవంతులను చేయడం లక్ష్యంగా నవీ ముంబైలోని టెర్నా డెంటల్‌ కాలేజిలో నిర్మించిన టూత్‌బ్ర్‌ష శిల్పం ‘ఫాస్ట్‌మినార్‌’కు ఈ అవార్డు లభించిందని తెలిపింది. 80 వేల టూత్‌బ్ర్‌షలతో ప్రపంచంలోని ఈ అతిపెద్ద టూత్‌ బ్రష్‌ శిల్పాన్ని నిర్మించినట్టు పేర్కొంది.


 ఈ ఫాస్ట్‌మినార్‌ నిర్మాణంలో ఉపయోగించిన టూత్‌బ్ర్‌షలను దేశవ్యాప్తంగా ఉన్న 8,890 మంది దంతవైద్యులు అందించారు. టెర్నా డెంటల్‌ కళాశాలలో 365 రోజుల పాటు ఈ ఫాస్ట్‌మినార్‌ ప్రదర్శనలో ఉంటుందని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఆ తర్వాత దాన్ని పడగొట్టి ఆ టూత్‌ బ్ర్‌షలన్నింటినీ రీసైకిల్‌ చేసి నిర్మాణ కార్యకలాపాల్లో ఉపయోగించనున్నట్టు పేర్కొంది. 


Updated Date - 2021-09-29T05:57:42+05:30 IST