Advertisement
Advertisement
Abn logo
Advertisement

శరవేగంగా విస్తరిస్తున్న Omicron.. ఇప్పటికే అమెరికాలో కొత్త వేరియంట్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న Anthony Fauci

ఇటలీ, జర్మనీ, యూకే సహా పలు దేశాల్లో 'ఒమైక్రాన్' కేసులు

వాషింగ్టన్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. మొదట దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ రోజుల వ్యవధిలోనే ఇతర దేశాలకు పాకింది. బోత్స్వానా, హాంగ్‌కాంగ్, ఇజ్రాయిల్‌లో కేసులు వెలుగు చూశాయి. శనివారం నాటికి ఒమైక్రాన్ మరికొన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. యూకే(02), జర్మనీ(02), బెల్జీయం(01), ఇటలీ(01)లో కొత్తగా ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అటు చెక్ రిపబ్లిక్‌లో కూడా ఓ అనుమానిత కేసు నమోదైనట్లు సమాచారం. ఇలా తక్కువ సమయంలోనే కొత్త వేరియంట్ వాయువేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుజాగ్రత్తగా ఇప్పటికే పలు దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి రాకపోకలను నిలిపివేశాయి. విమాన సర్వీసులను సైతం రద్దు చేశాయి. 

ఇదిలాఉంటే.. కొత్త వేరియంట్ ఒమైక్రాన్ విషయమై అమెరికాకు చెందిన అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా. ఆంథోనీ ఫౌచీ ఓ ప్రముఖ న్యూ ఏజెన్సీతో మాట్లాడారు."ఇప్పటికే ఈ వేరియంట్ యూఎస్‌లో ప్రవేశించి ఉన్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు దేశంలో ఒమైక్రాన్ కేసులు నమోదుకాలేదు. కానీ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతుంది. కనుక చాలా తక్కువ సమయంలోనే ఇది ప్రపంచ దేశాలను చుట్టేయవచ్చు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు" అని ఫౌచీ చెప్పుకొచ్చారు. మరోవైపు చాలా దేశాలు కొత్త వేరియంట్‌ను కట్టడి చేసే పనిలో పడ్డాయి. విదేశీ ప్రయాణికులకు పీసీఆర్ టెస్టులు, స్క్రీనింగ్, క్వారంటైన్ వంటి నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలాగే ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ కూడా 12 దేశాల నుంచి వచ్చేవారికి కరోనా టెస్టు, స్క్రీనింగ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.      

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement