ఫాస్టింగ్‌ మిస్టేక్స్‌

ABN , First Publish Date - 2022-03-01T05:30:00+05:30 IST

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తున్నా కొంతమంది బరువు

ఫాస్టింగ్‌ మిస్టేక్స్‌

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌  చేస్తున్నా కొంతమంది బరువు తగ్గరు. ఇలా జరగడానికి మనం అనుసరిస్తున్న ఫాస్టింగ్‌లో లోపాలు ఉండడమే కారణం. వాటిని సరిదిద్దుకుంటే ఫలితం కనిపిస్తుంది.


పాల ఉత్పత్తులు: కొంతమందికి పాల ఉత్పత్తుల ఇంటాలరెన్స్‌ ఉంటుంది. దాంతో వాళ్ల శరీరాలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురై, కార్టిసాల్‌ పెరిగిపోతుంది. ఇది అధిక బరువు తగ్గడానికి అవరోధంగా మారుతుంది. ఈ ఇబ్బంది తొలగాలంటే ఫాస్టింగ్‌లో పాల ఉత్పత్తులను కూడా చేర్చి, కనీసం నెల రోజుల పాటు వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. ఆ నెల రోజుల్లో బరువు తగ్గుతున్నట్టు గమనిస్తే, అదే తరహా ఫాస్టింగ్‌ను కొనసాగించాలి. 


మధ్యలోనే వదిలేయడం: తక్కువ క్యాలరీలతో రోజంతా గడపవలసి ఉంటుంది కాబట్టి ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ ఎక్కువ రోజులు కొనసాగించడం ఎవరికైనా కష్టమే! అయితే ఉపవాసం వల్ల చీకాకు, కోపం పెరుగుతున్నా, నీరసం ఆవరిస్తున్నా వారం రోజుల్లోనే ఉపవాసానికి స్వస్థి చెప్పేయాలి అనిపిస్తుంది. నిజానికి సరైన ఉపవాస విధానాన్ని ఎంచుకుంటే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. కాబట్టి  డైటీషియన్‌ సూచనలు, సలహాలు పాటిస్తూ ఆకలిని అదుపులో ఉంచే ఆహారంతో ఉపవాసం కొనసాగించాలి.


కొవ్వు భయం: మన శరీరాలు ఆరోగ్యకరమైన కొవ్వుల మీదే ఆధారపడతాయి. మన కాలేయం కొవ్వును కీటోన్లుగా విడగొడుతుంది. వీటితో మన శరీరానికి అవసరమైన శక్తి సమకూరుతుంది. నిజానికి ఇలాంటి కొవ్వులను సరిపడా తీసుకున్నప్పుడు ఆకలి బాధలు ఉండవు.


Updated Date - 2022-03-01T05:30:00+05:30 IST