ఫాస్టాగ్‌ బ్యాలెన్స్‌ ఇలానూ తెలుసుకోవచ్చు

ABN , First Publish Date - 2022-06-25T10:31:51+05:30 IST

ఫాస్టాగ్‌ ఉనికిలోకి వచ్చిన తరవాత సొంత వాహనాల్లో రోడ్డుపై ప్రయాణం తేలికగా మారింది. టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు, చిల్లర కోసం వెతుక్కోవడాలు,

ఫాస్టాగ్‌ బ్యాలెన్స్‌ ఇలానూ తెలుసుకోవచ్చు

ఫాస్టాగ్‌ ఉనికిలోకి వచ్చిన తరవాత సొంత వాహనాల్లో రోడ్డుపై ప్రయాణం తేలికగా మారింది. టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు, చిల్లర కోసం వెతుక్కోవడాలు, చాంతాడంత క్యూలో వేచి ఉండే పని తప్పింది. చెల్లింపు ప్రక్రియను ఆర్‌ఎఫ్‌ఐడి ఆధారిత వ్యవస్థ సులువుగా మార్చింది. మొదట్లో చిన్నపాటి అవాంతరాలు ఎదురైనప్పటికీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. ఫాస్టాగ్‌ అకౌంట్‌లోకి నగదును పంపుకొనే ప్రక్రియ కూడా సాఫీగానే సాగిపోతోంది. అయితే సదరు అకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఎంతుందో తెలుసుకోవాలి అనుకుంటే పలు పద్ధతులు ఉన్నాయి. అవేంటి అంటే....


1

స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌ లేదంటే యాప్‌స్టోర్‌లోకి వెళ్ళాలి.

మై ఫాస్టాగ్‌ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

లాగిన్‌ సమాచారాన్ని నింపాలి.

ఇప్పుడిక ఫాస్టాగ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు.


2

ఫాస్టాగ్‌ అకౌంట్‌ను లింక్‌ చేసిన బ్యాంక్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి.

మీ క్రెడెన్షియల్స్‌తో ఫాస్టాగ్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి.

డ్రాప్‌ డౌన్‌ మెనూ వ్యూ బ్యాలెన్స్‌ను సెలెక్ట్‌ చేసుకోవచ్చు. 


3

ఎస్‌ఎంఎస్‌ విధానం నేరుగా ఉండే పద్ధతి. ఇందులో స్టెప్స్‌ అంటూ ఏమీ ఉండవు. ఫాస్టాగ్‌ సర్వీస్‌ రిజస్టర్‌ చేసుకుని ఉంటే చాలు, టోల్‌ బూత్‌ వద్ద అమౌంట్‌ కట్‌గానే మెసేజ్‌ రూపంలో తెలుస్తుంది. రీచార్జ్‌ కన్ఫర్మేషన్స్‌ సహా సమస్త సమాచారం అందుతుంది.


4

ఎన్‌హెచ్‌ఎఐ కి చెందిన ప్రీపెయిడ్‌ వాలెట్‌లో మొబైల్‌ నంబర్ని రిజస్టర్‌ చేసుకుంటే చాలు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 

91 - 8884333331కి రోజులో ఎప్పుడైనా కాల్‌ చేసి, బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. 

ఈ నాలుగు పద్ధతుల్లో ఏదైనా ఒకటి ఎంచుకుని, తద్వారా బ్యాలెన్స్‌ ఎంతుందన్నది తెలుసుకోవచ్చు. 

Updated Date - 2022-06-25T10:31:51+05:30 IST