స్పందన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-24T06:30:39+05:30 IST

స్పందన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టరు, ఐటీడీఏ పీవో సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

రంపచోడవరం, మే 23: స్పందన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టరు, ఐటీడీఏ పీవో సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఆయన సబ్‌ కలెక్టర్‌ కట్టా సింహాచలం, డీఎఫ్‌వో నిషాకుమారి, ఐటీడీఏ ఏపీవో(జీ) పీవీఎస్‌ నాయుడు, డీడీ ఎం.ముక్కంటితో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన గ్రామాలలో వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పనిదినాలు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ మొత్తం 60 అర్జీలు అందాయన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ వెంకటేశ్వరరావు, డీడీ రమేష్‌నాయక్‌, ఈఈలు డేవిడ్‌రాజు, ఎండీ యూసఫ్‌, నాగేశ్వరరావు, పీహెచ్‌వో వై.సత్యనారాయణ, తహశీల్దారు కె.లక్ష్మీకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:30:39+05:30 IST