ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన KKR ఫాస్ట్ బౌలర్

ABN , First Publish Date - 2022-04-24T00:23:05+05:30 IST

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన KKR ఫాస్ట్ బౌలర్

ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన KKR ఫాస్ట్ బౌలర్

ముంబై: ఐపీఎల్ 2022: ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య 35వ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఫాస్ట్ బౌలర్ ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఆడుతుండగా 20వ ఓవర్ బౌలింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్.. అభినవ్ మనోహర్, లాకీ ఫెర్గూసన్, రాహుల్ తెవాటియా, యష్ దయాల్‌లను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రస్సెల్ వేసిన ఏకైక ఓవర్ ఇది. 1-0-5-4 తో రికార్డు సృష్టించాడు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి గుజరాత్ టైటాన్స్ 156 పరుగులు చేసింది. 12.4 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ 5 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌ జట్టుపై విజయం సాధించాలంటే కోల్‌కతా నైట్ రైడర్స్ 42 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది.

Updated Date - 2022-04-24T00:23:05+05:30 IST