Fashion designer ప్రత్యూషది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

ABN , First Publish Date - 2022-06-15T22:45:27+05:30 IST

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూషది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. ఆమె డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

Fashion designer ప్రత్యూషది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

హైదరాబాద్: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూషది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. ఆమె డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. విష వాయువును పీల్చి ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రత్యూష ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదన్నారు. సూసైడ్ లెటర్‌లో కూడా ఎవరి పేర్లు లేవని పోలీసులు తెలిపారు. ప్రత్యూష స్నేహితులు, కుటుంబసభ్యులను విచారించామన్నారు. ఈ కేసులో ఎవరిపైనా అనుమానాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. 


ఎంతో మంది సినీతారలకు అందమైన దుస్తులను రూపొందించిన గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బొగ్గుల కుంపటిలో కార్బన్‌ మోనాక్సైడ్‌ ద్రావణం పోసి.. దాన్నుంచి వచ్చిన విషవాయువును పీల్చి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తీవ్ర ఒత్తిడితోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యూష స్వస్థలం ఏపీలోని విజయవాడ. ఆమె వద్ద దుస్తులు డిజైనింగ్‌ చేసుకున్న ప్రముఖుల్లో సినీతారలు పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్‌, కాజోల్‌ దేవగన్‌, విద్యాబాలన్‌, రవీనాటాండన్‌, నేహా దూపియా, జుహీ చావ్లా, కృతి కర్బందా, క్రీడాకారిణి సానియా మీర్జా వంటి ఎంతో మంది ఉన్నారు.

Updated Date - 2022-06-15T22:45:27+05:30 IST