Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 8 2021 @ 13:05PM

మా ఇంట్లో జన్మించి ఉంటే ఇందిర ముస్లిం అయ్యేవారు : ఫరూఖ్ అబ్దుల్లా

శ్రీనగర్ : నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ భారత దేశాన్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. తాము హిందూ, ముస్లిం, సిక్కుల మధ్య ఎన్నడూ వివక్ష చూపలేదన్నారు. తాను నెహ్రూ కుటుంబంలో జన్మించి ఉంటే బ్రాహ్మణుడిని అయి ఉండేవాడినని, ఇందిరా గాంధీ తన కుటుంబంలో జన్మించి ఉంటే ఆమె ముస్లిం అయి ఉండేవారని అన్నారు. జమ్మూలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


తాము భారత దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి నినాదాన్ని చేయలేదని, అయినా తమను పాకిస్థానీలని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఖలిస్థానీ అని కూడా అన్నారని చెప్పారు. తాము మహాత్మా గాంధీ మార్గంలో నడుస్తున్నామని చెప్పారు. గాంధీజీ భారత దేశాన్ని తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాము గాంధీ గారి భారత దేశంలో విలీనమయ్యామని, గాడ్సే భారత దేశంలో కాదని చెప్పారు. తాము హిందువులు, ముస్లింలు, సిక్కుల మధ్య వివక్ష చూపలేదన్నారు. 


ఫరూఖ్ అబ్దుల్లా ఆదివారం మాట్లాడుతూ, రైతులు ఓ ఏడాదిపాటు పోరాడి సాగు చట్టాలను రద్దు చేయించుకున్నారని, తాము కూడా తమ హక్కులను తిరిగి పొందడానికి త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అధికరణ 370, అధికరణ 35ఏలను పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. 


Advertisement
Advertisement