తెలివి తేటలుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని నిరూపించాడు.. ఇప్పటికే రూ.2 కోట్ల ఆస్తి ఎలా సాధ్యమయిందంటే..

ABN , First Publish Date - 2022-09-09T21:22:41+05:30 IST

తెలివి తేటలుండాలే గానీ.. డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదని నిరూపించాడు రాజస్థాన్‌ (Rajasthan)కు చెందిన ఓ పేద రైతు.

తెలివి తేటలుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని నిరూపించాడు.. ఇప్పటికే రూ.2 కోట్ల ఆస్తి ఎలా సాధ్యమయిందంటే..

తెలివి తేటలుండాలే గానీ.. డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదని నిరూపించాడు రాజస్థాన్‌ (Rajasthan)కు చెందిన ఓ పేద రైతు. అల్వార్ నగరానికి 10 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం.. గుజుకి. అక్కడ ఓ చిన్న ఇంట్లో ఉండే యువరైతు వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేసి తన అదృష్టాన్ని మార్చుకున్నాడు. సమీప ప్రాంతాల్లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఆ వ్యక్తి పేరు జితేంద్ర కుమార్ సైనీ(40). ఎరువుల తయారీలో సరికొత్త విధానాన్ని ఆవిష్కరించి విజయవంతం అయ్యాడు. 


ఇది కూడా చదవండి..

కన్నకూతురిపై అత్యాచారం చేశాడంటూ భర్తపైనే కేసు పెట్టిన భార్య.. 20 నెలల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలివీ..!


సాధారణంగా పొలంలో చాలా మంది రసాయన మందులు, పురుగుమందులు, ఎరువులు వాడతారు. కానీ, జితేంద్ర ఆవుల సహాయంతో సహజ సిద్ధంగా ఎరువులు తయారు చేస్తున్నాడు. ఆవు పేడ, పాలు, మూత్రం, పెరుగు, మజ్జిగ, నెయ్యి కలిపి ఎరువును తయారు చేసి వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల తన భూమి సారవంతం అయిందని, ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయిందని తెలిపాడు. జితేంద్ర 2015లో గిర్ జాతికి చెందిన ఆవులను కొనుగోలు చేశాడు. వాటి పేడతో స్లర్రీ తయారు చేసి పొలంలో వేయడం ప్రారంభించాడు. రసాయన మందులు, యూరియా వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. ప్రస్తుతం అతని వద్ద 16 ఆవులు ఉన్నాయి.


ప్రతి ఏడాది పసుపు, బెల్లం, మట్టితో పాటు ఆవు పేడలో పాలు, మజ్జిగ, నెయ్యి కలిపి ఎరువుగా తయారు చేసి తన మూడెకరాల పొలంలో జల్లుతాడు. దాదాపు పదేళ్లుగా జితేంద్ర ఇదే తరహాలో ఎరువులను తయారు చేసి వాడుతున్నాడు. దీంతో ఉత్పత్తి 70 టన్నుల నుంచి 110 టన్నులకు పెరిగింది. రసాయన ఎరువులు, యూరియా కోసం ఏడాదికి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు చేసేవాడిని, ఇప్పుడు ఈ ఖర్చు సున్నాగా మారిందని జితేంద్ర తెలిపాడు. `మా మూడు ఎకరాల పొలంలో ఏటా రూ.35 లక్షల విలువైన కూరగాయలు విక్రయిస్తున్నాం. ఖర్చు ఏడాదికి రూ.10 లక్షలు. ఏడాదికి 25 లక్షలు ఆదా అవుతాయి. ఇలా పదేళ్లలో రెండున్నర కోట్లు సంపాదించామ`ని జితేంద్ర చెప్పాడు. జితేంద్ర దగ్గరకు సలహాలు, సంప్రదింపుల కోసం స్థానిక రైతులు క్యూ కడుతున్నారు. 

Updated Date - 2022-09-09T21:22:41+05:30 IST