రైతు శ్రేయస్సు కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి

ABN , First Publish Date - 2021-01-14T04:28:39+05:30 IST

ఏ ప్రభుత్వమైనా రైతు శ్రేయస్సు కోసమే పనిచేయాలే తప్ప రైతు వ్యతిరేక విధానాలను అవలంభించకూడదని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

రైతు శ్రేయస్సు కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి
రైతు వ్యతిరేక చట్టాల జీవో పత్రాలను భోగిమంటల్లో దహనం చేస్తున్న టీడీపీ ఇన్‌చార్జి నెలవల, రైతులు

 నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల 


నాయుడుపేట, జనవరి 13 : ఏ ప్రభుత్వమైనా రైతు శ్రేయస్సు కోసమే పనిచేయాలే తప్ప రైతు వ్యతిరేక విధానాలను అవలంభించకూడదని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల నాయకులు, రైతులతో కలిసి బుధవారం భోగి మంటల్లో రైతు వ్యతిరేక చట్టాల జీవో పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రైతు రుణమాఫీని విడతల వారీగా చేసి రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. అయితే ఈ ప్రభుత్వంలో రూ.లక్షకే పరిమితం చేయడం పట్ల రైతులకు తీవ్రనష్టం కలిగిందన్నారు. అలాగే వ్యవసాయ పొలాల వద్ద మీటర్లను ఏర్పాటు చేసే పద్ధతిని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో  టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల టీడీపీ అధ్యక్షులు జీసీ రత్నం, వేలూరు మురళీకృష్ణారెడ్డి, గజ్జలపూడి విజయ్‌కుమార్‌నాయుడు, నేతలు ప్రభాకర్‌నాయుడు, పుల్లయ్య, దయాకర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T04:28:39+05:30 IST