అతివృష్టితో అన్ని పంటలూ నష్టపోయిన రైతులు

ABN , First Publish Date - 2022-01-25T05:56:39+05:30 IST

అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారంపై అధికారుల తప్పుడు నివేదికలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తు న్నాయి.

అతివృష్టితో అన్ని పంటలూ నష్టపోయిన రైతులు
కళ్యాణదుర్గం ప్రాంతంలో నీటమునిగిన వేరుశనగ పంట (ఫైల్‌)


పంటనష్టంపై వాస్తవ నివేదికలు పంపని అధికారులు

ఎకరాకు రూ.6వేల పరిహారానికి ప్రతిపాదనలు 

దుమ్మెత్తిపోస్తున్న అన్నదాతలు  

కళ్యాణదుర్గం, జనవరి 24 : అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారంపై అధికారుల తప్పుడు నివేదికలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తు న్నాయి. మూడు నెలల కిందట ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాలకు వేరుశనగ, వరి, టమోటా, పప్పుశనగ పంటలు నీటి మునిగాయి. పశుగ్రాసం కూడా దొర కని దుస్థితి. ఎకరా పంటసాగుకు రూ.25వేలు పెట్టుబడి పెట్టగా పరిహారం అం చనా రూ.6వేలతో ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. గ్రామ వలంటీర్లు చెప్పిన రైతుల పేర్లు మాత్రమే జాబితాలో పొందపరుస్తూ కాకిలెక్కలతో సరిపెట్టారనే వాదనలు ఉన్నాయి. కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్‌డివిజన పరిధిలో 1.2267 లక్షల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉంది. సబ్‌డివిజన పరిధిలో సాగుచేసిన వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయినట్టు ప్రభుత్వానికి నివేదిక పంపామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కళ్యాణదుర్గం మండలంలో 147 మంది రైతులకుగాను 3025 హెక్టార్లు, బ్రహ్మసముద్రం 166 మంది రైతులకు గాను 529 హెక్టార్ల్లు, కంబదూరు 74 మంది రైతులకు గాను 112 హెక్టార్లు, బెళుగుప్ప 481 మంది రైతులకు గాను 6880 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు నివేదిక తయారు చేశారు. వరి, బొప్పాయి. టమో టా, వేరుశనగ,  తదితర పంటలకు ఎకరాకు రూ.6వేలు, పప్పుశనగ పంటకు ఎకరాకు రూ.4500 ప్రకారం పంటనష్టం జరిగినట్టు అధికారులు పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఆశాఖ రికార్డుల్లో నమోదైంది.  శెట్టూరు మండలంలో ఎలాంటి పంట నష్టం జరగలేదని చెప్పడంతో ఆ మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం మండలాల్లో పప్పుశనగ పంటనష్టం రూ.3.1కోట్లు, నాలుగు మండలాల్లో అన్ని రకాల పంటల నష్టం రూ.2.4కోట్లు అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. 


క్షేత్రస్థాయిలో సర్వే శూన్యం

అధిక వర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన దాఖలాలు లేవని పలు గ్రామాల రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఎంతమంది రైతులున్నారు. పంటసాగు విస్తీర్ణం ఎంత వంటి వివరాలు కూడా సచివాలయ ఉద్యోగుల వద్ద లేవని రైతులు వాపోతున్నారు. లక్ష హెక్టార్లలో పంటలు సాగవగా సుమారు 10వేల హెక్టార్లలో మాత్రమే పంటనష్టం జరిగినట్లు అధికారులు లెక్క లు తేల్చడంపై రైతులు భగ్గుమంటున్నారు.

Updated Date - 2022-01-25T05:56:39+05:30 IST