గన్నీ బ్యాగుల కోసం రైతుల నిరీక్షణ

ABN , First Publish Date - 2021-11-28T04:22:29+05:30 IST

రైతులు వానాకాలం సాగుచేసిన పంటలకు ప్రారంభం నుంచి చివరి వరకు ఇబ్బందులు తప్పడం లేదు.

గన్నీ బ్యాగుల కోసం రైతుల నిరీక్షణ
పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం ముందు గన్నీ బ్యాగుల కోసం క్యూ కట్టిన రైతులు

నారాయణపేట రూరల్‌, నవంబరు 27 : రైతులు వానాకాలం సాగుచేసిన పంటలకు ప్రారంభం నుంచి చివరి వరకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ధాన్యాన్ని విక్రయించాలన్నా గన్నీ బ్యాగుల కోసం తిప్పలు తప్పడం లేదు. శనివారం పేట జిల్లా కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయం ముందు రైతులు గన్నీ బ్యాగుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. సాయంత్రం సర్వర్‌ బిజీ రావడంతో టోకెన్లు పొందిన రైతులకు సైతం బ్యాగులు దొరకలేదు.  చివరకు సర్వర్‌ రాకపోవడంతో విండో సిబ్బంది ఆదివారం రావాలని చెప్పడంతో రైతులు చేసేది లేక వెనుదిరిగారు. 

Updated Date - 2021-11-28T04:22:29+05:30 IST