బిందు సేద్యం పరికరాల కోసం రైతులు ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-03-04T07:01:23+05:30 IST

బిందు సేద్యం పరి కరాల కోసం రైతులు సుమారు ఇరవై నెలలుగా ఎదురు చూస్తున్నారు.

బిందు సేద్యం పరికరాల కోసం రైతులు ఎదురుచూపు
బిందు సేద్యం ద్వారా ఉద్యాన పంటకు సన్నాహాలు

కోటవురట్ల, మార్చి 3 : బిందు సేద్యం పరి కరాల కోసం రైతులు సుమారు ఇరవై నెలలుగా ఎదురు చూస్తున్నారు. కూరగాయలు, పండ్ల తోటల సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులకు రాయితీ పై ఈ పరికరాలను అందజేసేవారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పొదుపుగా వాడకుంటూ తద్వారా ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు, పంటల పెంపకానికి ఈ పథకం ఎంతో దోహదడుతుంది. గత టీడీపీ ప్రభుత్వం ఉద్యానవ పంటల ప్రోత్సా హానికి చిన్న, సన్నకారు రైతులకు రాయితీపై ఈ పరికరాలు అందజేసేంది. ఐదు ఎకరాలలోపు వ్యవ సాయ భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, ఐదు ఎకరాలకంటే తక్కువగా ఉన్న ఇతర రైతులకు 90 శాతం, ఐదు ఎకరాలకు మించి పది ఎకరాలలోపు ఉన్న రైతులకు 70శాతం, పది ఎకరాలు దాటిన రైతులకు 50శాతం సబ్సీడీపై ఈ పరికరాలను అందించేంది. వేలాది మంది రైతులు సద్వినియోగం చేసుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకంపై చిన్నచూపు చూస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ అంశాన్ని మండల ఉద్యానవన శాఖాధికారి ఉమామహేశ్వరి వద్ద   ప్రస్తావించగా, బిందు సేద్యం పథకం ఏడాదిన్నర నుంచి అమలులో లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-04T07:01:23+05:30 IST