అధిక దిగుబడులపై రైతులకు సాంకేతిక పరిజ్ఞానం

ABN , First Publish Date - 2021-07-31T06:00:34+05:30 IST

రైతులకు అధిక దిగుబడులపై సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రైతు భరోసా యాత్ర వాహనం దోహదపడుతుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.

అధిక దిగుబడులపై రైతులకు సాంకేతిక పరిజ్ఞానం
రైతు భరోసా యాత్ర వాహన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, తదితరులు

 మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం టౌన్‌, జూలై 30 : రైతులకు అధిక దిగుబడులపై సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రైతు భరోసా యాత్ర వాహనం దోహదపడుతుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.  మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్‌ నుంచి శుక్రవారం రైతు భరోసా వాహనాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ చైతన్య యాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ నాలుగు రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. నెలకు 1000 కిలో మీటర్లు రథం పర్యటిస్తుందన్నారు. రాష్ట్రంలోని 10,544 ఆర్‌బికెల్లో ఈ యాత్రలు జరుగుతాయన్నారు. ఈ క్రాపింగ్‌ బుకింగ్‌ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్‌ తంటిపూడి కవిత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సిలార్‌దాదా, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ షేక్‌ అచ్చాబా, వైస్‌చైర్మన్‌ తోట సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జేడి టి. మోహనరావు, వ్యవసాయ శాఖ డిడి మణిధర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ రథయాత్ర బందరు మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం పర్యటించింది.


Updated Date - 2021-07-31T06:00:34+05:30 IST