సుప్రీంకోర్టులో రైతులకు ఊరట

ABN , First Publish Date - 2021-09-06T20:33:56+05:30 IST

సుప్రీంకోర్టులో రైతులకు ఊరట లభించింది. ఢిల్లీ సింఘు సరిహద్దు దగ్గర రైతుల ధర్నాపై సుప్రీంకోర్టులో సింఘు పరిసర సోనిపట్ నివాసితులు పిటిషన్‌ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టులో రైతులకు ఊరట

ఢిల్లీ: సుప్రీంకోర్టులో రైతులకు ఊరట లభించింది. ఢిల్లీ సింఘు సరిహద్దు దగ్గర రైతుల ధర్నాపై సుప్రీంకోర్టులో సింఘు పరిసర సోనిపట్ నివాసితులు పిటిషన్‌ దాఖలు చేశారు. సింఘు సరిహద్దును రైతులు అనధికారికంగా మూసివేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. జాతీయరహదారిని ఒక వైపు అయినా తెరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే స్థానిక హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. సామాన్యుడి రోజువారీ సమస్యలను హైకోర్టు పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు నిరాకరించింది. పిటిషన్ ఉపసంహరణకు అవకాశం ధర్మాసనం కల్పించింది. స్థానిక హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

Updated Date - 2021-09-06T20:33:56+05:30 IST