వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2020-11-25T05:16:25+05:30 IST

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతుల ధర్నా

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతుల ధర్నా
ధర్నా చేస్తున్న రైతులు

లోకేశ్వరం, నవంబరు 24 : మండలంలోని హవర్గాలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభిం చాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ రైతులు మంగళవారం మండలంలోని మన్మధ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. గ్రామంలో ధాన్యాన్ని కేంద్రంలో నిల్వ ఉంచి రోజులు గడుస్తున్న అధి కారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపో వడంతో రైతులు ధర్నా చేపట్టినట్లు పేర్కొ న్నారు. ప్రభుత్వం ఎప్పటిలాగే గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్‌ వెంకటరమణ మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, సర్పంచ్‌ భుజంగ్‌రావులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. దీంతో అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభిం చలేదని అధికారులను రైతులు ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్‌ వెంకటరమణ గ్రామంలో వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలపడంతో రైతులు ధర్నాను విరమించుకున్నారు.

Updated Date - 2020-11-25T05:16:25+05:30 IST