ధాన్యం.. దైన్యం

ABN , First Publish Date - 2020-12-03T04:21:03+05:30 IST

వరి రైతులు ఆగచాట్లు ప డుతున్నారు.

ధాన్యం.. దైన్యం
మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం మరికల్‌లో కల్లాల వద్ద ధాన్యం నిల్వలు

- పంటను అమ్ముకోవడానికి అన్నదాతల కష్టాలు 

- కల్లాల్లోనే ధాన్యాన్ని చూసి కన్నీళ్లు

- సన్నాలకు మద్దతు, ప్రోత్సాహకం ఇవ్వని సర్కారు 

- రంగుమారిన ధాన్యంపై స్పష్టత కరువు

- గన్నీ బ్యాగుల కొరతతో మందగించిన కొనుగోళ్లు

- భారీ లక్ష్యమున్నా కొనుగోళ్లలో జాప్యం 

- ‘ప్రైవేట్‌’లో తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతాంగం


ధాన్యం రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి.. వరుస వానలతో ప్రకృతి అతలాకుతలం చేస్తే, పండిన తర్వాత అమ్ముకోవడానికి సైతం నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనాలని నిర్దేశించినా, గన్నీ బ్యాగుల కొరత, రంగు మారిన ధాన్యం, కొనుగోళ్లు పుంజుకోకపోవడం వంటి కారణాలతో ధాన్యం కల్లాలలోనే ఉండిపోతున్న పరిస్థితి ఏర్పడింది.. కొనుగోళ్లు ప్రారంభమై పక్షం రోజులవుతున్నా, వేగం పెరగకపోవడంపై అన్నదాతలలో ఆందోళన వ్యక్తమవుతోంది.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న  ఇబ్బందులను పరిష్కరించడంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనే సూచనలు వస్తున్నాయి..


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వరి రైతులు ఆగచాట్లు ప డుతున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభు త్వం ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మాల ద్వారా గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు  చేసినా, క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా తే మ ఉందని, రంగు మారిందనే సాకుతో ధాన్యం కొనడం లేదు. ఈ విషయంలో ప్రభు త్వం నుంచి కూడా స్పష్టత లేదు. ఈ కారణంతో వనపర్తి, నారాయణపేట జిల్లాలలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నారు. అలాగే సన్న రకాల ధాన్యం విషయంలో తాలు, తేమ శాతం పేరుతో కొనుగోలు చేయడం లేదు. దీంతో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో రైతులు వ్యాపారులకే తక్కువ ధరకే ధాన్యం అ మ్ముకుంటున్న దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పక్షం రోజుల నుంచి ధా న్యం కొనుగోళ్లు ప్రారంభమైనా, ఇప్పటి వరకు కేవలం 87,106 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయడం ఇందుకు నిదర్శనంగా చెప్పాల్సి వస్తున్నది. సన్నాలకు అ దనపు ధర గానీ, బోనస్‌ గానీ ఇస్తారనే ఆశలో ఉన్న రైతులకు అలాంటి ప్రోత్సాహకమే దీ దక్కలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని మద్దతు ధర దక్కేంత వరకు నిల్వ ఉంచుకోవాలో, లేక వచ్చిన ధరకు అమ్ముకోవాలో తేల్చుకోలేక ఒకవైపు, వాతావర ణంలో వస్తున్న మార్పులు, తుపాను సూచనలతో ఏదో ఒక ధరకు అమ్ముకుందామనే ని స్సహాయ స్థితిలో మరోవైపు ఆవేదన చెందుతున్నారు.


గన్నీ బ్యాగుల కొరత


ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 7,74,563 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. మొత్తం 1,71,95,000 గన్నీ బ్యాగులు అవసరమవుతాయని గు ర్తించింది. రైతుల వద్ద ఉన్న సంచులను సేకరించడంతో పాటు, తాజాగా కొన్న బ్యాగులు కలుపుకొని 97,01,680 గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచింది. ఇంకా, 74,93,320 బ్యాగులు అవసరముండగా, అవి వస్తాయో, రావో తెలియని పరిస్థితి. ప్రధానంగా జోగు ళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గన్నీ బ్యాగుల కొరతతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. పలు కేందాల్ర్లో ధాన్యం ఉన్నా, బ్యాగుల్లేని కారణంగా కొనడం లేదు. కొ నుగోళ్లు మరింత వేగవంతమైతే గన్నీ బ్యాగుల కొరత అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో తలెత్తే ప్రమాదం ఉంది. వాటిని సమకూర్చుకునే విషయంలో ప్రత్యామ్నాయాలపై అధి కారులు దృష్టి సారించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


భారీ లక్ష్యమైనా.. కొన్నది గోరంతే..


ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 13,60,834 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుండగా, 7,74,563 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఐదు జిల్లాల్లో పక్షం రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. భారీ లక్ష్యం నిర్దేశించుకున్నా రంగు మారిన ధాన్యం, తాలు, తేమ, గన్నీ బ్యాగుల కొరత కారణాలతో ఇప్పటి వరకు కేవలం 87,106 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఇదే రీతిన కొనుగోళ్లు సా గితే, వేచి చూసే ఓపిక నశించి రైతులు వ్యాపారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకునే దుస్థితి ఏర్పడుతుంది.

Updated Date - 2020-12-03T04:21:03+05:30 IST