అల్లూరి స్ఫూర్తితో రైతాంగ పోరాటాలకు సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2022-07-04T05:15:11+05:30 IST

అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్రంలో రైతాంగ పోరాటాలకు సిద్ధం కావాలని రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య పిలుపునిచ్చారు.

అల్లూరి స్ఫూర్తితో రైతాంగ పోరాటాలకు సిద్ధం కావాలి
చందలూరులో అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జమలయ్య

 రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి  జమలయ్య పిలుపు

పంగులూరు, జూలై 3: అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్రంలో రైతాంగ పోరాటాలకు సిద్ధం కావాలని రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ  జయంతి సందర్భంగా మండ లంలోని చందలూరు గ్రామంలో ఆదివారం జరిగిన  కార్యక్రమంలో అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ రైతాంగ ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచాలని కోరారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ భూ ములు మొత్తం కార్పొరేట్‌ సంస్థల పరం చేసేవిధంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు      పండించే రైతులు పంటకు గిట్టుబాటు ధర లభించక, చీడపీడలతో నష్టాల బారినపడి అప్పులు తీరే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని అంగడిలో పెడుతున్న బీజేపీకి అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడే హక్కు లేదని జమలయ్య అన్నారు. వ్యవసాయాన్ని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేం దుకు అల్లూరి స్ఫూర్తిగా ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్‌బాబు, తలపనేని రామారావు తదితరులు పాల్గొన్నారు.

హక్కులకోసం ఉద్యమిద్దాం 

చీరాల టౌన్‌, జూలై 3:  అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమించాలని సీపీఎం నాయ కులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పేరాల లోని సీఐటీయూ కార్యాలయంలో అల్లూరి 125వ జయంతి వేడుకలు ఘ నంగా నిర్వహించారు.  అల్లూరి చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి ఎన్‌.బాబురావు, ఎం.వసంత రావు, గోసాల ఆశీర్వాదం, ఎల్‌.జయరాజు,  సయ్యద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

  చరిత్ర మరవదు.. అల్లూరి పోరాటం

మార్టూరు, జూలై 3: బ్రిటీషు వారిని ఎదిరించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరి త్రను భావితరాల వారు మర్చిపోరని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్‌ గంగయ్య అన్నారు.  అల్లూరి 125వ జయంతి ఉత్సవాల సం దర్భంగా ఆదివారం మండలంలోని రాజుగారిపాలెంలో సీతారా మరాజు విగ్రహానికి గ్రామస్థులతో కలిసి సీపీఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆపార్టీ మండల కార్యదర్శి బత్తుల హను మంతరావు, బి.సూరిబాబు, గఫూర్‌, ఇబ్రహీం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T05:15:11+05:30 IST