రైతులు ఆందోళన చెందొద్దు

ABN , First Publish Date - 2020-04-04T09:40:07+05:30 IST

వరి రైతులు దిగులు చెందొద్దని గ్రామాల్లోనే ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్‌

రైతులు ఆందోళన చెందొద్దు

డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి


కులకచర్ల: వరి రైతులు దిగులు చెందొద్దని గ్రామాల్లోనే ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ డీసీసీబీ, డీసీఎంఎస్‌, ఐకేపీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులు వరిధాన్యం తమ ఇళ్ల వద్దే నిల్వ ఉంచుకోవాలన్నారు. కరోనా నిర్మూలన కోసం మండల పరిధిలో నుంచి రూ.10 లక్షల విరాళాలు సేకరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ నర్సింహులు, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T09:40:07+05:30 IST