కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగ కుండా చూడాలి

ABN , First Publish Date - 2021-05-07T06:24:35+05:30 IST

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగ కుండా చూడాలి
సిర్గాపూర్‌లో ధాన్యంను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

దిలావర్‌పూర్‌, మే 6 : వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. మండలంలోని న్యూ లోలం, కాల్వ, సిర్గాపూర్‌ గ్రామాల్లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వరి ధాన్యం విక్రయించిన ఒకటి రెండు రోజుల్లోగా రైతులకు డబ్బులు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ట్యాబ్‌ ఎంట్రీ వెనువెంటనే చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు గోనె సంచులను అందుబాటులో ఉంచాలని రైతులు కోరారు. లారీలు తొందరగా వచ్చేలా చూడాలని రైతులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ  సమస్యలన్నింటిని రెండు మూడు రోజుల్లోగా పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. అదనపు కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సంతోష్‌ రెడ్డి, ఎంపీడీవో మోహన్‌ రెడ్డి, ఎంపీవో అజీజ్‌ ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T06:24:35+05:30 IST