రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-10-28T05:46:30+05:30 IST

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సీఐ యాసంగిలో కొనడం లేదని ప్రకటించిన నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రైతులకు సూచించారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి 

నల్లగొండ టౌన్‌, అక్టోబరు 27 : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సీఐ యాసంగిలో కొనడం లేదని ప్రకటించిన నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రైతులకు సూచించారు.  ఆర్జాలబావి వద్ద ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా రైతు కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. సీఎం సూచనల మేరకు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌  చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు కూడా ధాన్యాన్ని ఆరబెట్టి సరైన మాయిశ్చర్‌ వచ్చాకే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, నల్లగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌ ఆలకుంట్ల నాగరత్నంరాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొర్ర సుధాకర్‌, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:46:30+05:30 IST