రైతులు ఐకేపీ సంఘాలకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-11-30T04:56:04+05:30 IST

మండల పరిధిలోని వీరాయిపల్లి, దొడగుంటపల్లి, చిన్న మందడి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రేణుకాదేవి సోమవారం పరిశీలించారు.

రైతులు ఐకేపీ సంఘాలకు సహకరించాలి
వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్న అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రేణుకాదేవి

. అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రేణుకాదేవి

. మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏపీడీ


పెద్దమందడి, నవంబరు 29 : మండల పరిధిలోని వీరాయిపల్లి, దొడగుంటపల్లి, చిన్న మందడి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రేణుకాదేవి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేగవంతంగా చేయాలని అన్నారు. తేమ 14శాతం ఉండాలని, తాలు లేకుండా చూడాలని సూచించారు. ప్రతిరోజు తూకాలు చేసి ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. ఎప్పటికప్పుడు రైల్‌మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని, రైతులు ఐకేపీ సంఘాలకు సహకరించాలని కోరారు. వచ్చే యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డి, ఆయా గ్రామాల మహిళా సంఘాలు, ఏపీఎం వెంకన్న, సీసీలు ఆంజనేయులు, కాశీనాథ్‌, రాణి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-30T04:56:04+05:30 IST