Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాండ్రంలో రొయ్యల చెరువులు వద్దంటూ నిరసన

వాండ్రం(ఉండి), అక్టోబరు 21 : అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ వరి రైతులు నిరసన దీక్షకు దిగారు.   వాండ్రంలో రొయ్యలు చెరువులకు అనుమతులు ఇవ్వవద్దని, తవ్విన చెరువులను నిషేధించాలని గురువారం నిరసన తెలిపారు. చెరువులకు అనుమతులు ఇవ్వ వద్దని రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. తక్షణమే త్రవ్విన చెరువులను నిషేధించాలని వరి రైతులు డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement