హైదరాబాద్: సాగు చట్టాలపై రైతులు విజయం సాధించారని ఎమ్మెల్యే సీతక్క కొనియాడారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు కేంద్రం అండగా ఉండాలన్నారు. ధాన్యం విషయంలో సీఎం కేసీఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్‌లో రూ.3 వేల కోట్లు ఖర్చుపెట్టిన కేసీఆర్‌కు.. ధాన్యం కొనేందుకు డబ్బులు లేవా? అని సీతక్క ప్రశ్నించారు.