అర్హత ఉన్నా..అందని రుణం

ABN , First Publish Date - 2022-08-19T06:36:50+05:30 IST

తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టుగా ఉంది కౌలు రైతుల పరిస్థితి..

అర్హత ఉన్నా..అందని రుణం

కౌలు కార్డుదారులకు బ్యాంకుల మొండిచేయి

పెరవలి, ఆగస్టు 18 : తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టుగా ఉంది కౌలు రైతుల పరిస్థితి.. కౌలు రైతులకు అధికారులు కౌలు కార్డులు కేటాయిస్తున్నప్పటికి బ్యాంకులకు వెళితే రుణాలు అంద డం లేదు. కొంత మంది రైతులు ముందే బ్యాంకుల్లో రుణాలు కలిగి ఉండడంతో అదే సర్వే నెంబరుపై  రుణం ఇవ్వలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు.కొంత మందికి అటువంటి ఇబ్బంది లేకపోయినప్పటీకి హామీ దారు సంతకం ఉం టేనే రుణం ఇస్తామని మెలిక పెట్టడంతో మరి కొంత మంది ఇబ్బందిపడుతు న్నారు.చాలా మం ది రైతులు కౌలు వ్యవసాయం చేస్తునప్పటికీ కౌలు కార్డు పొందడమే కష్టంగా మారింది.  గతంలో భూ యజమానులతో  సంబంధం లేకుండా కార్డులు మంజూరు చేసే వారు. బ్యాంకుల్లో కూడా అంతకు ముందు భూ యజమాని రుణం తీసుకున్నప్పటికి  రుణం మంజూ రయ్యేది. ప్రస్తుతం ఆ విధంగా భూ యజమానుల సంతకం ఉండి పట్టా దారు పాసుపుస్తకం నకలును జత పరిస్తేనే కార్డు ఇస్తామని మెలిక పెట్టడం వల్ల చాలా మంది కార్డులు పొందలేకపోతున్నారు. దీంతో రుణాలే కాకుండా ప్రభుత్వ  సబ్సిడీలు, పంట నష్టపరిహారాలు పొందలేకపోతున్నారు. ఈ మేరకు నిబంధనలు మార్పు చేయాలని కౌలు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పెర వలి మండలంలో గతేడాది 2,6 65 మందికి కౌలు కార్డులు ఉండగా ఈ  ఏడాది 3,561 మందికి  కౌలు కార్డులు ఇచ్చామని ఏవో చెబుతున్నారు. వీరిలో సగం మందికి రుణాలు అందని పరిస్థితి నెలకొంది. 

Updated Date - 2022-08-19T06:36:50+05:30 IST