Abn logo
Feb 21 2020 @ 12:49PM

66వ రోజుకు చేరిన రైతుల నిరసనలు

అమరావతి: రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు శుక్రవారం నాటికి 66వ రోజుకు చేరాయి. మహాశివరాత్రి పండగ రోజు కూడా రైతులు ఆందోళనలు  కొనసాగిస్తున్నారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నేలపాడు, రాయపూడి, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, మందడం, తుళ్లూరులో రైతులు, మహిళలు ధర్నాలు చేపట్టారు. రాజధానిలోని ఇతర గ్రామాల్లో కూడా దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement