నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
కౌటాల, మే 28: మండలంలోని సాండ్‌గాంలో వడ్లు కొనడంలేదని రైతులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీసెంటర్ ద్వారా వడ్లుకొనుగోలు చేయా ల్సి ఉండగా ఏఈవోను వడ్ల కొనుగోలు సెంటర్‌కు ఇన్‌ఛార్జీగా నియ మించారు. అదే ఏఈవోకు 10వ తరగతి పరీక్షలలో సిట్టింగ్ స్క్వాడ్‌గా నియమించారు. దీంతో వడ్లు కొనుగోలులో జాప్యం జరుగుతోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు పేర్కొన్నారు.