బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై రైతుల నిరసన

ABN , First Publish Date - 2020-07-07T11:05:31+05:30 IST

ఖరీ్‌ఫ 2018-19లో శనగ బీమా కోసం చెల్లించిన ప్రీమియం ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెల్లింపులో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ కోగటం

బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంపై రైతుల నిరసన

కమలాపురం, జూలై 6: ఖరీ్‌ఫ 2018-19లో శనగ బీమా కోసం చెల్లించిన ప్రీమియం ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెల్లింపులో బ్యాంకు అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ కోగటం ఎస్‌బీఐ బ్రాంచ్‌ పరిధిలోని కంచెన్నగారిపల్లె, కోగటం, హనుమనగుత్తి గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. 2018-19 సంబంధించి రబీలో శనగ పంటకు సంబందించి 130 మంది రైతులు బ్యాంకు ద్వారా బీమా ప్రీమియం చెల్లించారు. అయితే ఈ ప్రీమియం డబ్బులను బ్యాంకు అధికారులు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్‌ బ్యాంకుకు కాకుండా ఇతర బ్యాంకుకు చెల్లించడంతో అప్పటిలోనే ప్రీమియం డబ్బులు రైతుల ఖాతాల్లో తిరిగి జమ అయింది.


ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు దాచిపెట్టారు. ప్రస్తుతం బీమా మంజూరు కావడం రైతుల అకౌంట్‌లో బీమా పడలేదని తెలుసుకున్న రైతులు బ్యాంకు వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. దాదాపు రూ.18 లక్షల బీమా డబ్బులను తాము కోల్పోయామని, అందుకు కారకులైన బ్యాంకు సిబ్బందే తమకు చెల్లించాలని గొడవకు దిగారు. ఈ విషయమై రైతు నాయకుడు ప్రసాద్‌రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపారు. చీఫ్‌ మేనేజర్‌, రీజినల్‌ మేనేజర్‌లు మల్లికార్జున, కృష్ణమోహన్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలోని 133 మంది రైతులు బీమా రాకపోవడం పట్ల గగ్గోలు పెడుతున్నారు. ఉన్నతాధికారులు కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2020-07-07T11:05:31+05:30 IST