సోలార్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2020-11-29T17:12:42+05:30 IST

అనంతపురం జిల్లా కందబూరు మండలం నూతిమడుగు గ్రామ రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.

సోలార్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

కంబదూరు: అనంతపురం జిల్లా కందబూరు మండలం నూతిమడుగు గ్రామ రైతులు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం తమ భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. నూతిమడుగు గ్రామ పరిసరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం వందలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులతో భూమి సేకరణ విషయంపై చర్చించేందుకు కళ్యాణదుర్గం ఆర్డీవో రామ్మోమన్, ఇతర రెవెన్యూ అధికారులతో కలిసి నూతిమడుగు గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నూతిమడుగు గ్రామంతో పాటు ఇరుగు పొరుగు గ్రామాలకు చెందిన వందలాది రైతులు అక్కడికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. తమ పొలాలు సోలార్ ప్లాంట్‌కు ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు. పేరూరు ప్రాజెక్టుకు నీళ్లు ఇస్తే తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటామని అధికారులకు రైతులు తెలియజేశారు. రైతులతో పోలీసులు చాలా సేపు మాట్లాడినా వారు వినలేదు. దీంతో చేసేది లేక పోలీసులు వెనుదిరిగారు. రైతుల విన్నపాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.



Updated Date - 2020-11-29T17:12:42+05:30 IST