Abn logo
Jul 22 2021 @ 15:37PM

జంతర్‌ మంతర్‌ వద్ద రైతుల ఆందోళన

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. జంతర్ మంతర్ సమీపంలోని అన్ని మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. సింఘుబాద్ నుంచి రైతులు బస్సుల్లో జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.


నూతన వ్యవసాయ చట్టం రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌ను ముట్టడించి తీరుతామన్నారు. గురువారం నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం రైతులకు అనుమతి ఇచ్చింది. అయితే రోజుకు 2 వందల మంది రైతులు మాత్రమే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని షరతు పెట్టింది. అందుకు రైతు సంఘాల నాయకులు ఒప్పుకున్నారు.