ముంపులో పొలాలు

ABN , First Publish Date - 2020-07-13T12:08:28+05:30 IST

వర్షాలకు చాలా ప్రాంతాల్లో నారు కుళ్లి పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

ముంపులో పొలాలు

5 వేల హెక్టార్లలో వరినాట్లు..

540 హెక్టార్లలో నారుమళ్లు ముంపు


ఏలూరుసిటీ, జూలై 12 : వర్షాలకు  చాలా ప్రాంతాల్లో నారు కుళ్లి పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇక వరినాట్లు వేసిన పంట పొలాల్లో కూడా నీరు తీయడం లేదని దీంతో ఊడ్చిన పొలాల్లో కూడా పంటలు దెబ్బ తింటాయని చెబుతున్నారు. జిల్లాలో వ్యవసాయశా ఖాధికారుల నివేదికల ప్రకారం 5,540 హెక్టార్లలో వరి పంట పొలాలు నీట ముని గాయని చెబుతున్నారు. ఇందులో 540 హెక్టార్లలో వరినారుమళ్లు, ఐదు వేల హెక్టా ర్లలో  నాట్లు వేసిన పంట పొలాలు ముంపు నకు గురయ్యాయన్నారు. కొవ్వాడ కాలువ ఉధృతి కార ణంగా జిల్లాలోని దేవరపల్లి మండలం గౌరీ పట్నంలో 1100 ఎకరాల్లో, గోపాలపురం నియోజకవర్గంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో వరినాట్లు వేసిన పంట పొలాలు మంపునకు గురయ్యాయని ఆయా ప్రాంత రైతులు చెబుతున్నారు. అయితే ఆ పొలాల్లో ఊడ్చిన పంట దెబ్బతిందని మళ్లీ నారుమళ్ళు వేయాల్సిందేనంటున్నారు. 


తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 41.2 మి.మీ వర్షపాతం

గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా తాడేపల్లిగూడెంలో 41.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 3.3 మి.మీ నమోదైంది. గణపవరంలో 21, పెంటపాడు మండలంలో 17.4, నరసాపురంలో 14.2, ఉంగుటూరులో 12.4, నిడ మర్రులో 12.4, ద్వారకాతిరుమలలో 10.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-07-13T12:08:28+05:30 IST