దొడ్డు రకం వరి సాగుకే రైతుల మొగ్గు

ABN , First Publish Date - 2021-01-25T05:18:00+05:30 IST

ఈ యేడు వర్షాకాలంలో కురిసిన వానలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీం తో యాసంగిలో వరిసాగు గణనీయంగా పెరగనుంది. వా నాకాలం సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో అంచనాలను మించి వ రి పంట సాగైంది. ఈ యాసంగిలోనూ అదే పునరావృతం కానుంది.

దొడ్డు రకం వరి సాగుకే రైతుల మొగ్గు

ఉమ్మడి జిల్లాలో యాసంగిలో ఇప్పటివరకు 4.5 లక్షల ఎకరాలలో సాగైన వరి

ఇప్పటికే 80 శాతానికి పైగా నాట్లు పూర్తి

మొక్కజొన్నకూ పెరిగిన డిమాండ్‌

పప్పుదినుసుల పంటల సాగు అంతంతే

మార్కెటింగ్‌పైనే అన్నదాతల్లో ఆందోళన

కామారెడ్డి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఈ యేడు వర్షాకాలంలో కురిసిన వానలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీం తో యాసంగిలో వరిసాగు గణనీయంగా పెరగనుంది. వా నాకాలం సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో అంచనాలను మించి వ రి పంట సాగైంది. ఈ యాసంగిలోనూ అదే పునరావృతం కానుంది. అయితే వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రి త సాగు విధానం పేరిట ఆంక్షలు విధించడంతో రైతులు స న్నరకాలను సాగు చేయగా గిట్టుబాట ధర రాక నష్టపోయా రు. ఈ క్రమంలో ప్రభుత్వం నియంత్రిత సాగుపై వెనక్కి తగ్గింది. పంటలు వేసుకోవడం నుంచి అమ్ముకోవడం వరకు రైతుల ఇష్టానికే వదిలేస్తున్నట్టు ప్రకటించింది. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పంటలు వేస్తున్న రైతులు మార్కె టింగ్‌ ఎలా ఉంటుందోననే ఆందోళనతో ఉన్నారు. 

దొడ్డురకం వరికే మొగ్గు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో జలవనరులు సమృద్ధిగా ఉండడంతో యాసంగి పంటల సాగు జోరందుకుంది. భూగ ర్భజలాలు పెరగడం వరికి అనుకూలంగా మారింది. రెండు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంటల సాగు ఆరు లక్షల ఎకరాలకుపైగా అవుతు ందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 4.30 లక్షల ఎకరాల లో పంటలు సాగయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఐదు ల క్షల ఎకరాలకు పైగా వరి సాగవుతుందని అంచనా వేయ గా.. ఇప్పటివరకు 3.50 లక్షల ఎకరాలలో సాగైనట్లు అధికా రులు చెబుతున్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 2.30 లక్షల ఎకరాలలో వరి సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 96 వేల ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి. ఈ నెలాఖరులోగా జిల్లాలో వరినాట్లు పూర్తయ్యే అవకాశాలు ఉ న్నాయి. గత వానాకాలం పంటల ఎఫెక్ట్‌తో రైతులు సన్నాల సాగుకు స్వస్తిపలికారు. వానాకాలంలో పండించిన సన్న ధా న్యానికి మద్దతు ధర లభించకపోవడం, మిల్లర్లు మాయాజా లం నేపథ్యంలో ఈ యాసంగిలో రైతులు దొడ్డు రకాలనే సా గు చేస్తున్నారు. యాసంగిలో సన్నరకం దిగుబడి తక్కువగా వస్తుండడం కూడా ఓ కారణం అయితే.. ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలను ఎత్తివేస్తామని చెబుతున్న పరిస్థితుల్లో దొ డ్డు రకాలను మార్కెటింగ్‌ చేయడం ఎలా అనే గందరగోళం ఏర్పడుతోంది.

మక్కల సాగుపైనా మక్కువ

ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ఎత్తివేయడంతో ఉమ్మడి జిల్లాలో రైతులు మొక్కజొన్నలు సాగు చేస్తున్నారు. వానాకాలంలో మక్కసాగు వద్దని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ, నీటి వనరులు ఉండడంతో ఈసారి మక్కలు సాగు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో మక్క సాగుపై వ్యవసాయ అధికారులు ప్రణాళికలు పొందుపరిచినప్పటికీ ఈ యాసంగిలో సుమారు 30 వేల ఎకరాలలో మక్క పంట సాగుచేశారు. కామారెడ్డి జిల్లాలో 11 వేల 444 ఎకరాలలో సాగు కాగా.. నిజామాబాద్‌ జిల్లాలో 22 వేల ఎకరాలలో సా గైనట్లు అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న తర్వాత ఉభయ జిల్లాల్లో ఎక్కువగా శనగ పంటను సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో శనగ 47 వేల ఎకరాల లో సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 69 వే ల 907 ఎకరాలలో సాగు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 15 వేల ఎకరాలలో సాగుచేశారు.

పప్పు దినుసుల పంటల సాగు అంతంతే

నిజామాబాద్‌ జిల్లాతో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో ప్రతీ సీజన్‌లోనూ పప్పుదినుసు పంటలను రైతులు విస్తారంగానే సాగు చేస్తారు. అయితే, ఈ వానాకాలం సీజన్‌లో భారీ వ ర్షాలు కురవడం, నీటిలభ్యత ఎక్కువగా ఉండడంతో పప్పుది నుసు పంటలో శనగ తర్వాత వరి, మొక్కజొన్న పంటలను సాగుచేసేందుకు మొగ్గు చూపారు. కంది, మినుములు, పె సర్లు తదితర పప్పుదినుసు పంటలను అంతంత మాత్రంగా నే సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలో పెసర్లు 8 ఎకరాలలో, మినుములు 52 ఎకరాలలో సాగుచేయగా.. శనగ 69 వేల ఎకరాలలో సాగు చేశారు. ఇవే కాకుండా 1,300 ఎకరాలలో రాజుమా, 400 ఎకరాలలో పొద్దుతిరుగుడు, 9వేల ఎకరాల లో జొన్న, 7 వేల ఎకరాలలో చెరుకుపంటను సాగుచేశారు.

Updated Date - 2021-01-25T05:18:00+05:30 IST