ఏడాది నిరసనకు గుర్తుగా 500 ట్రాక్టర్లతో Parliamentకు రైతులు

ABN , First Publish Date - 2021-11-10T01:01:55+05:30 IST

మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 26 నాటికి సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా 500 ట్రాక్టర్లు, ట్రాలీలతో పార్లమెంట్‌కు వెళ్లాలని..

ఏడాది నిరసనకు గుర్తుగా 500 ట్రాక్టర్లతో Parliamentకు రైతులు

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా నవబంర్ 26న 500 ట్రాక్టర్లతో పార్లమెంట్‌కు వెళ్లేందుకు నిరసనలో ఉన్న రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయమై మంగళవారం మీడియాకు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది జనవరి 26న ట్రాక్టర్లతో ఎర్రకోటకు రైతులు వెళ్లారు. అయితే ఎర్రకోట వద్ద జరిగిన కొన్ని పరిణామాలు ఆ ర్యాలీని విజయవంతం కానివ్వలేదు. అనంతరం ఢిల్లీ సరిహద్దుల్లోనే ఆందోళన కొనసాగిస్తూ వచ్చారు.


మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 26 నాటికి సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా 500 ట్రాక్టర్లు, ట్రాలీలతో పార్లమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. జనవరి 26న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి తప్పిదాలు జరక్కుండా ఉండేందుకు రైతు సంఘాల నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు సమాచారం.

Updated Date - 2021-11-10T01:01:55+05:30 IST