మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2021-05-08T05:02:45+05:30 IST

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని శుక్రవారం మండలంలోని గూడెంలో మాస్కులు ధరించి రైతులు రాస్తారోకో నిర్వహించారు.

మొక్కజొన్న కొనుగోళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు
రాస్తారోకో చేస్తున్న రైతులు

ఓదెల, మే 7 : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని శుక్రవారం మండలంలోని గూడెంలో మాస్కులు ధరించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఒకవై పు కరోనా, మరోవైపు వాతావరణంలో మార్పులు వస్తున్నప్పటికి ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటులో ఇప్పటికి స్పష్టత లేదని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో విధిలేక మధ్య దళారులకు మక్కలు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెం దుతున్నామని, మరో 15రోజుల్లో రోహిణికార్తె ప్రవేశం ఉన్నందున నష్టాలకు గురికాక ముందే మక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత ఖరీప్‌లో మొక్కజొన్న లు అమ్ముకున్న తరువాత ప్రభుత్వం సానుకూల స్పష్టత ఇవ్వడంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మక్కల కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జాప్యంతో రోడ్డెక్కిన రైతులు రెండు గంటల పాటు మాస్కులు ధరించి నిరసన తెలిపారు. దీంతో కాల్వశ్రీరాంపూర్‌ నుంచి జమ్మికుంట వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో గోవిం దుల రామస్వామి, కామని శ్రీనివాస్‌, కర్ర శ్రీధర్‌, బుడిగె రాములు, మహేష్‌, మారెడ్డి వెంకటరెడ్డి, బండి సంతోష్‌, వీరముష్టి సతీష్‌, రాజు, శ్రీకాంత్‌, తిరుపతి, శ్రీనివాస్‌తో పాటు తదితర రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T05:02:45+05:30 IST