పంటలకు గిట్టుబాటు ధర లేకే రైతన్న అప్పులపాలు

ABN , First Publish Date - 2021-09-19T05:44:35+05:30 IST

పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వస్తోందని నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు.

పంటలకు గిట్టుబాటు ధర లేకే రైతన్న అప్పులపాలు
నారాయణమూర్తిని సన్మాస్తున్న ఏఎంసీ చైర్మన శ్రీనివాస్‌రెడ్డి

సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి
చౌటుప్పల్‌ టౌన, సెప్టెంబరు 18 : పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వస్తోందని  నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం సాయం త్రం ఆయన చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డును  సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తిని ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి సన్మానించారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుందన్నారు. ఢిల్లీలో రైతు లు నెలల తరబడి ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు పం డించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని అనడం తప్ప వారిని ఆదుకోవడం లేదన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ అనే రోజు రావాలని, అప్పుడే రైతన్న సుఖసంతోషాలతో జీవిస్తాడని అన్నారు.డాక్టర్‌ స్వామినాథన కమిటీ సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినప్పుడే రైతుకు నిజమైన న్యాయం జరిగి, తలెత్తుకొని తిరి గే పరిస్థితి వస్తుందన్నారు. రైతన్న సినిమా కార్పొరేట్‌ రంగాలకు ప్రశ్నపత్రం లాంటిదన్నారు. రైతన్న నవ్వుతూ ఉన్నప్పుడే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సుఖసంతోషాలు లభిస్తాయన్నారు. రైతులు పడుతున్న కష్టనష్టాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలతో జరిగే దుష్పరిణామాలను వివరిస్తూ తీసిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని  కోరారు. ఏఎంసీ చైర్మన శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతం కోసం తీసిన రైతన్న సినిమాలో రైతుల స్థితిగతులు, పడుతున్న బాధలు చక్క గా చూపించారన్నారు.  కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్‌ సుర్కంటి నవీనరెడ్డి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ ఎండి. బాబాషరీప్‌, వి.నాగరాజుగౌడ్‌, సీపీఎం నాయకులు బూరుగు కృష్ణారె డ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-19T05:44:35+05:30 IST