రైతు ఉద్యమంపై నిర్బంధ కాండ

ABN , First Publish Date - 2021-10-19T05:28:20+05:30 IST

రైతు ఉద్యమంపై పోలీస్‌ నిర్బంధకాండ దారుణమని జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.

రైతు ఉద్యమంపై నిర్బంధ కాండ

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 18: రైతు ఉద్యమంపై పోలీస్‌ నిర్బంధకాండ దారుణమని జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  రైతు సంఘాల నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఎం.రాజశేఖర్‌, జి.సూరిబాబు, తోకల ప్రసాద్‌ పాల్గొన్నారు. వామపక్ష నాయకులు, రైతులను గృహ నిర్బంధం చేయడాన్ని కాకినాడ రేచర్లపేట ఐక్యవేదిక ఖండించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ రైతులను చంపిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-19T05:28:20+05:30 IST