నడింపల్లె వద్ద చిక్కుడు తీగజాతి పంట
రామసముద్రం, మే19: రామసము ద్రం మండలంలో రైతులు తీగజా తి పంట సాగు చేసేందుకు ఆసక్తి చూ పుతున్నారు. వరి, వేరుశనగ, చెరకు, టమోటా పంటల సాగు ఇబ్బందిగా మారడంతో తక్కువ ఖర్చు, స్వల్పకాలంలోనే పంట దిగుబడి వచ్చే కాకర, చిక్కుడు, బీర తదితర తీగజాతి పంటలపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఉద్యాన పంటలకు రాయితీలు ఇస్తుండటంతో తీగజాతి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మండలంలో చెంబకూరు, పెద్దకురప్పల్లె, ఎలవానెల్లూరు, కురిజల, కేసీ పల్లె, అరికెల పంచాయతీల్లో తీగజాతి పంటలు సాగులో వున్నాయి.
పంటలకు చీరల పరదాలు
ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బీన్స్, టమోటా, స్వీట్‌కార్న్, రోజా, పంటలకు రక్షణగా రైతులు చీరలు పరదాలు చుట్టారు. దీని వలన గాలుల ఒత్తిడి తగ్గి సూక్ష్మక్రిములను పంట లకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రైతులు తెలిపారు.