నీటి సంరక్షణ ద్వారా జీవనోపాధిని మెరుగుపరుస్తున్న ‘అల్ట్రాటెక్’

ABN , First Publish Date - 2022-06-06T00:48:01+05:30 IST

వాటర్‌షెడ్, జీవనోపాధి శిక్షణ కార్యక్రమాల ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని రెండు గ్రామాల్లో ప్రజల జీవనోపాధిని

నీటి సంరక్షణ ద్వారా జీవనోపాధిని మెరుగుపరుస్తున్న ‘అల్ట్రాటెక్’

కర్నూలు: వాటర్‌షెడ్, జీవనోపాధి శిక్షణ కార్యక్రమాల ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని రెండు గ్రామాల్లో ప్రజల జీవనోపాధిని అల్ట్రాటెక్ మెరుగుపరుస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ అయిన ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ (APCW) తన ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలో ఈ కరువు సంబంధిత సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 2019లో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) భాగస్వామ్యంతో ఈ ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు APCW అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. 


దాదాపు 500 కుటుంబాలు ఈ నీటి సంబంధిత కార్యక్రమాల నుండి నేరుగా లబ్ధిపొందాయి. APCW, ICRISAT భాగస్వామ్యంతో ఈ రెండు గ్రామాల్లో ఏడు వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను ఏర్పాటు చేసింది. పెట్నికోట, అయ్యవారిపల్లి గ్రామాలలో ఈ వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు దాదాపు 35,000 క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాయి. ఫలితంగా ఈ రెండు గ్రామాలలోని రైతులు అధిక పంట దిగుబడి సాధించారు.  

Updated Date - 2022-06-06T00:48:01+05:30 IST