రైతులు వరి వేయొద్దు

ABN , First Publish Date - 2021-12-09T06:35:22+05:30 IST

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం డియా ధాన్యం కొనబోమని చెబుతోంది కావున ప్రభుత్వం ఽధాన్యం కొనుగోలు చేయదు రైతులు వరి వేయకు ండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

రైతులు వరి వేయొద్దు
లింగపేటలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

కోతులు, అడవి పందుల పరిష్కారానికి కృషి చేస్తాం

సర్వే నెంబర్‌ 983 భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ 

 లింగంపేట, డిసెంబరు 8 : ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం డియా ధాన్యం కొనబోమని చెబుతోంది కావున ప్రభుత్వం ఽధాన్యం కొనుగోలు చేయదు రైతులు వరి వేయకు ండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. ఆయన బుధవారం లింగం పేట మండల కేంద్రంలోని రైతువేదికలో యాసంగి పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలో కోతు లు, అడవి పందుల సమస్య ఎక్కువగా ఉందని ఇక్కడి భూములు సైతం వరికి ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయని రైతులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ప్రత్యేక టీంలు ఉన్నాయని వారికి ఫిర్యాదు చేస్తే అడవి పందులను షూట్‌చేసే వారు వచ్చి వాటిని చంపుతారని, కోతుల సమస్య పరిష్కారానికి మండలంలోని స్వచ్ఛం ధ సంస్థలు, ఇతర ప్రజాప్రతినిదుల సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. భూసార పరీక్షలు చేసుకునేం దుకు అవసరమైన వారిని నియమిస్తామన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు కావల్సిన మంచి విత్తనాలు, వ్యవసాయ అధికారుల సలహా మేరకు వేసుకో వాలని ఆయన సూచించారు. కొందరు రైతులను మోసం చేసేందుకు వరి వేయండని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులను రెచ్చగొడుతున్నా రని వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌ 983లో 450ఎకరాల్లో సుమారు 175 మంది రైతులు ఎంతో కాలం గా సాగు చేస్తున్నప్పటికీ ఇటీవల అటవీశాఖ అధికారులు అట్టి భూమిని అటవీశాఖదిగా చూపుతున్నారని రైతులకు పట్టాలు ఉన్నాయని రైతులకు న్యాయం చేయాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించగా కలెక్టర్‌ ఆ సమస్య నా దృష్టిలో ఉందని జాయింట్‌ సర్వే చేసి న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. మండలంలోని ఎల్లమ్మతండాలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జేడీఏ భాగ్యలక్ష్మీ, ఏడీఏ రత్నం, తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, ఏవో సాయిరమేష్‌, ఎంపీపీ గరీబున్నిసా, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నరహరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవే ందర్‌రెడ్డి, సర్పంచ్‌ లావణ్య, రైతు సమన్వయకమిటీ చైర్మన్‌ ఫారూఖ్‌లతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు.  

యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి

తాడ్వాయి: యాసంగిలో వరి పంట అసలే వేయొద్దని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. బుధవారం మండలంలోని కృష్ణాజివాడి రైతు వేదిక భవనంలో ఆయన రైతులకు యాసంగి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలైన పొద్దుతిరుగుడు, మినుము, పెసర, శనగ, మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు వేసుకోవాలని సూచించారు. యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని తెలిపారు. అందుకోస మే ప్రతీరైతు యాసంగిలో వరి వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. నీటి వసతి లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా వెంటనే బోరుబావి మంజూరు చేస్తున్నట్లు తెలిపా రు. అనంతరం ఎర్రాపహాద్‌ పీహెచ్‌సీని పరిశీలించి వ్యాక్సినేషన్‌ వేగవం తం జరిగేలా చూడాలని వైద్యాధికారి రవీందర్‌ర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు రత్న, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ నల్లవెల్లి కపిల్‌రెడ్డి, సర్పంచ్‌లు భూషణం, రాణి, ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ శాంతాభాయి, నారాయణరావు, వైస్‌ చైర్మన్‌ ధర్మారెడ్డి, ఉప సర్పంచ్‌ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మాపూర్‌లో కందకాల పరిశీలన

ఎల్లారెడ్డి: మండలంలోని లక్ష్మాపూర్‌ గ్రామ శివారులో ఉపాధి హామీ కింద చేపడుతున్న పనులను బుధవారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశిలించారు. ఉపాధిహామీలో చేపడుతున్న కందకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరగాలని, కూలీల సంఖ్య పెంచాలని తెలిపారు. కూలీలు పోస్టు అకౌంట్‌ నుంచి తమ బ్యాంక్‌ అకౌంట్‌లోకి ఖాతాలను మార్చుకోవాలని సూచించా రు. అధికారులు పేద కుటుంబాలకు పనులు చూపించాలని తెలిపారు. జాబ్‌కార్డులు పెంచే చర్య లు తీసుకోవాల ని, పనులు లేక కూలీలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. ఉపాధిహమి పనుల లో అవకతవకలు జరిగితే సంబ ంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీఓ ప్రకాష్‌, ఏపీఓ సక్కుభాయి గౌడ్‌, సెక్రెటరీ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

కామారెడ్డి టౌన్‌ : వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సహకార, సివిల్‌ సప్లయ్‌ అధికారులతో మాట్లాడారు. ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోలు వందశాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు ట్రాన్స్‌పోర్టర్‌లతో మాట్లాడి ధాన్యాన్ని లారీల్లో రైస్‌మిల్లుకు పంపించాలన్నారు. 

Updated Date - 2021-12-09T06:35:22+05:30 IST