రైతులు అధైర్య పడొద్దు

ABN , First Publish Date - 2022-05-17T05:41:19+05:30 IST

రైతులు అధైర్య పడొద్దు

రైతులు అధైర్య పడొద్దు
ఆర్థిక సాయం అందజేస్తున్న జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌

కడ్తాల్‌, మే 16: అకాలవర్షం, ఈదురు గాలులకు పంటలు, తోటలు దెబ్బతిని, షెడ్లు కూలి నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌ సూచించారు. మండలంలోని మక్తమందారంలో ఆదివారం రాత్రి గాలివానకు దెబ్బతిన్న మామిడి, మిర్చి, టమాల, వరి పంటలను, కూలిన పాడిపశువుల షెడ్లను సోమవారం ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా రైతు నరేష్‌ పాడిపశువుల షెడ్లు కూలిపోయి నష్టపోగా దశరథ్‌నాయక్‌ రూ.5వేలు, సర్పంచ్‌ సులోచన సాయిలు రూ.3వేలు, హరికోటం నర్సింహకు రూ.3వేలు అందజేశారు. పంట నష్ట వివరాలను వ్యవసాయ అధికారులు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని దశరథ్‌నాయక్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండి మంజుల చంద్రమౌళి, గాన్గుమర్ల సర్పంచ్‌ హంస మోత్యానాయక్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ నర్సింహాగౌడ్‌, ఉపసర్పంచ్‌ గణేశ్‌, నాయకులు మహేందర్‌, జలీల్‌, జంగయ్య, కృష్ణయ్య, చందు, భిక్షం, జంగమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:41:19+05:30 IST