మొక్కజొన్న కోనుగోలు చేయాలని రైతుల ధర్నా

ABN , First Publish Date - 2021-10-20T05:49:40+05:30 IST

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాజేశ్వర్‌రావుపేట, సత్యక్కపల్లె జాతీయ రహదారిపై బండలింగాపూర్‌, సత్యక్కపల్లె, చెర్లకొండాపూర్‌, రాజేశ్వర్‌రావుపేట, మేడిపల్లి గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు.

మొక్కజొన్న కోనుగోలు చేయాలని రైతుల ధర్నా
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

జాతీయ రహదారిపై బైఠాయింపు

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 19: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని రాజేశ్వర్‌రావుపేట, సత్యక్కపల్లె జాతీయ రహదారిపై బండలింగాపూర్‌, సత్యక్కపల్లె, చెర్లకొండాపూర్‌, రాజేశ్వర్‌రావుపేట, మేడిపల్లి గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ  మొక్కజొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు మొలకలు వచ్చి తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. వెంటనే కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కేవలం వరి ధాన్యం కోనుగోలు చేస్తామని ప్రకటించారే తప్ప మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించకపోవడం దారుణమన్నారు. మెట్‌పల్లి సీఐ ఎల్‌ శ్రీనివాస్‌ రైతుల వద్దకు వెళ్లి ఆందోళనను విరమింపజేశారు. రైతుల ఽధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు.  


Updated Date - 2021-10-20T05:49:40+05:30 IST