ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-11T06:45:05+05:30 IST

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో పలువురు రైతులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

‘సుజల స్రవంతి’లో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్‌

కలెక్టర్‌ ప్రకటించిన నోటిఫికేషన్‌లో అవకతవకలు సరిచేయాలని నినాదాలు


అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 10: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో పలువురు రైతులు బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం ప్రతినిధి కర్రి అప్పారావు, కౌలు రైతుల సంఘం ప్రతినిధి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని, పాత అలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని, 2013 భూసేకరణ చట్టప్రకారం మార్కెట్‌ విలువకు అదనంగా నాలుగు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అలాగే, జిల్లా కలెక్టర్‌ ప్రకటించిన నోటిఫికేషన్‌లో ఉన్న అవకతవకలను సరిచేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘాల నాయకులు గండి నాయనబాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు లోకనాథం, ఎస్‌వీ నాయుడుతో పాటు దాకారపు శ్రీను, యు.సత్యవతి, వరలక్ష్మి, గంటా శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-11T06:45:05+05:30 IST