అన్నదాతను అణగదొక్కేందుకు కేంద్రం కుట్ర

ABN , First Publish Date - 2020-12-06T05:08:07+05:30 IST

అన్నదాతలను అణగదొక్కడానికి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తుందని ప్రజా సంఘాల నేతలు విమర్శిం చారు.

అన్నదాతను అణగదొక్కేందుకు కేంద్రం కుట్ర
ఆకివీడులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ఆకివీడు, డిసెంబరు5: అన్నదాతలను అణగదొక్కడానికి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తుందని ప్రజా సంఘాల నేతలు విమర్శిం చారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా శనివారం గాంధీజీ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి గేదెల అప్పారావు,  వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కె.తవిటినాయుడు, సీఐటీయూ మండల కార్యదర్శి పెంకి అప్పారావు, డోకల లక్ష్మి, షేక్‌ వలీ, సందక సూరిబాబు, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.


భీమవరం :  వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఈ నెల 8న భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలని రైతు, కార్మిక ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి వాసుదేవరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. కిసాన్‌ సభ రాష్ట్ర కార్యదర్శి లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలు చేయబట్టే రైతుల్లో పెద్ద నిరసన వచ్చిందన్నారు. చెల్లబోయిన రంగారావు, జేఎన్‌వీ.గోపాలన్‌, కె.క్రాంతిబాబు, ఇంజేటి శ్రీనివాస్‌, కలిదిండి సత్యనారాయణ, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:08:07+05:30 IST