ఇదేనా రైతు ప్రభుత్వమంటే..

ABN , First Publish Date - 2021-06-15T05:56:11+05:30 IST

ధాన్యం పంపించి రెండు నెలలైనా రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ చేయకపోవడాన్నే రైతు ప్రభుత్వమంటారా అని రైతు కె.కనకయ్య, జన సేనాని గవర అనిల్‌ ఎద్దేవా చేశారు.

ఇదేనా రైతు ప్రభుత్వమంటే..
తుందుర్రులో ధర్నా చేస్తున్న రైతులు

పుస్తెలు తాకట్టు పెట్టి సాగు చేశాం..

ధాన్యం సొమ్ము చెల్లించాలంటూ రైతుల ఆందోళన

ఆకివీడు, జూన్‌ 14: ధాన్యం పంపించి రెండు నెలలైనా రైతుల అకౌంట్‌లో డబ్బులు జమ చేయకపోవడాన్నే రైతు ప్రభుత్వమంటారా అని రైతు కె.కనకయ్య, జన సేనాని గవర అనిల్‌ ఎద్దేవా చేశారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జనసేన నాయకులు, రైతులు ధర్నాచేసి తహసీల్దార్‌ సునిల్‌కుమార్‌కి,  వ్యవసాయశాఖ సిబ్బందికి వినతిపత్రం అందచేసి మాట్లాడారు. దాళ్వా ధాన్యం ప్రభుతా ్వనికి పంపించి రెండు నెలలు దాటుతున్నా నేటికి బ్యాంకుల్లో సొమ్ము జమకాకపోతే సార్వా సాగు ఎలా  చేసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పుస్తెలు  తాకట్టుపెట్టి వ్యవసాయం చేశామంటూ ఆగ్రహించారు.  ఒక పక్క గతేడాది తెచ్చిన క్రాప్‌లోను కట్టలేక,  కోత మిషన్‌, ట్రాక్టర్‌ బకాయిలు చెల్లించలేక నలిగిపోతున్నారన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. కార్యక్రమంలో  రైతులు, జనసేనానిలు పాల్గొన్నారు.

వీరవాసరం: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌  ఎన్‌. సుందరరాజుకు  వినతిపత్రం అందచేశారు. ధాన్యం సొమ్ము ఇవ్వని కారణంగా రైతులు ఖరీఫ్‌ పంటకు విత్తనాలు సమకూర్చుకోలేపోతున్నారన్నారు. ఽరైతులు ధాన్యాలు అమ్ముకుని రెండునెలలు కావస్తున్న ఇంతవరకూ సొమ్ములు చెల్లించకపోవటం దారుణమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం ఆవేదన వ్యక్తం చేశారు. బాలం విజయకుమార్‌, పోతుల మృత్యుంజయ, కేతా సత్యనారాయణ, కోటి శేషగిరిరావు, చింతా నారాయణమూర్తి, అయినంపూడి బాబూరావు, బొర్రా అలమహారాజు తదితరులు పాల్గొన్నారు. 

భీమవరం రూరల్‌:  ధాన్యం సొమ్ము చెల్లించాలంటూ తుందుర్రు ఆర్బీకే వద్ద కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కౌలు రైతుల సంఘం డెల్టా జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి ప్రసాద్‌ మాట్లాడుతూ రైతాంగం సార్వాకు సిద్ధమవుతున్నా దాళ్వా సొమ్ము చెల్లించకపోవడం దారుణమన్నారు. భూ యజమానుల  సంతకాలతో సంబంధం లేకుండా కౌలు కార్డులు అందించాలని డిమాండ్‌ చేశారు.  జిల్లా కమిటీ సభ్యుడు కోయ పెద్దిరాజు, రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-15T05:56:11+05:30 IST