రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-03-06T05:30:00+05:30 IST

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అల్లోల

నిర్మల్‌ రూరల్‌, మార్చి 6 : రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రైతులు అన్ని రంగాల్లో ముందుండి రైతుసంక్షేమ పథకాలు అంది పుచ్చుకొని, మేలు రకాలైన పంటలు పండించాలని మంత్రి అన్నారు. శని వారం రోజు నిర్మల్‌ మండలంలోని ఎల్లపెల్లి క్లస్టర్‌ న్యూ పోచంపాడ్‌ గ్రామం రైతు వేదిక నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమం జిల్లా రైతు సమన్వయ అధ్యక్షుడు నల్ల వెంకట్రామ్‌ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మదా ముత్యం రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌ఎస్‌సి చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, రాంకిషన్‌ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

తెలంగాణ భవన్‌ను సందర్శించిన మంత్రి అల్లోల 

జిల్లాలోని కొండాపూర్‌లో గల తెలంగాణ భవన్‌ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం రోజు సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి భవనాన్ని, చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాన్ని కలియతిరుగుతూ సంద ర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గౌడ్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, కొండాపూర్‌ సర్పంచ్‌ గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు. 

మల్లేష్‌ కుటుంబానికి పరామర్శ

నిర్మల్‌ మండలంలోని మల్లన్న జాతరలో ఇటీవల మరణించిన మల్లేష్‌ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం రోజు పరా మర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన మల్లేష్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి వివ రించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్‌ మండల ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

పార్‌పెల్లిలో కృష్ణారెడ్డికి పరామర్శ

లక్ష్మణచాంద, మార్చి 6 : మండలంలోని పార్‌పెల్లి గ్రామానికి చెందిన నాయకులు కృష్ణారెడ్డిని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆయన స్వగృహానికి వెళ్లి శనివారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా కృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని అన్నారు. మంత్రి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, తెరాస రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌, నాయకులు అల్లోల సురేందర్‌ రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్‌, తెరాస పార్టీ కన్వీనర్‌ కృష్ణారెడ్డి, అడ్వాల రమేష్‌, ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌ రాజేందర్‌, గోవర్ధన్‌, తదితరులు ఉన్నారు. 

వికలాంగుల సంఘానికి స్థలం కేటాయించండి

నిర్మల్‌ కల్చరల్‌, మార్చి 6 : నిర్మల్‌ జిల్లా వికలాంగుల సంఘ భవనానికి స్థలం కేటాయించాలని శనివారం తెలంగాణ స్పందన వికలాంగుల హక్కుల సంఘ నాయకులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. భవన నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. అధ్యక్షుడు ఇసాక్‌ అలీ, శ్రీనివాస్‌, మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-06T05:30:00+05:30 IST